భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎన్ కౌంటర్ కలకలం సృష్టించింది. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూ నక్సల్స్ తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఎస్బిబిఎల్ తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్ తదితర సామగ్రి లభ్యమయ్యాయని, తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.