Bhairavam : టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన సినిమా ”భైరవం”(Bhairavam). ఈ సినిమాకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ డ్రామగా తెరకెక్కినట్లు తెలుస్తుంది.మరి ఈ ముగ్గురు హీరోలు ”భైరవం” సినిమాతో మంచి విజయం సాధిస్తారో లేదో చూడాలి. ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై KK రాధామోహన్ నిర్మించారు.