న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ‘భారత్ బంద్’ విజయవంతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. అంతరాష్ట్ర రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రజా రవాణా ఎక్కడికక్కడ నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ధర్నాతో ఢిల్లీ–హర్యానా నేషనల్ హైవే దాదాపుగా మూతపడింది. పంజాబ్‌లో జాతీయ రహదారులపై అక్కడి రైతులు బైటాయించడంతో వాహనాలు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి.
ప్రతిపక్షాలు, రైతు సంఘాల పిలుపు
వ్యవసాయ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీ, ద్రావిడ మున్నెట్రా కజహ్గం, రాష్ట్రీయ జనతా దళ్తోపాటు 18 ప్రతిపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ‘భారత్ బంద్’కు పిలునిచ్చిన విషయం తెలిసిందే. వీరితోపాటు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ), అల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్(ఏఐఎఫ్‌యూ), అల్ ఇండియా కిసాన్ సంఘర్ట్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్సీసీ), అల్ ఇండియా కిసాన్ మహాసంఘ్(ఏఐకేఎం)లు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.
బంద్‌తో ప్రభావితమైన రాష్ట్రాలు
హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తిస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్.. మిగతా రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం పాక్షికంగా ఉంది.
భారత్‌బంద్: జాతీయ రహదారుల దిగ్బంధం
RELATED ARTICLES