Bharath Summit: హైదరాబాద్‌లో నేటి నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ భారత్ సమ్మిట్ జరగనుంది. ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్‌తో జరిగే సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ ఆమోదంతో పాటు ఒక తీర్మానం పాస్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పలు దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమ్మిట్ కు రానున్నారు. అయితే పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.