Homeహైదరాబాద్latest Newsబాధితులకు అండగా భరోసా సెంటర్

బాధితులకు అండగా భరోసా సెంటర్

– జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

ఇదే నిజం భూపాలపల్లి ప్రతినిధి: బాధిత మహిళలు, బాలలు అధైర్య పడకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు దీనిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. పోలీస్​ కార్యాలయం సమీపంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేటి నుంచి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహయకారిగా ఉంటుందని సూచించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల కు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ ఏ నరేష్ కుమార్, భూపాలపల్లి, కాటారం, వర్టికల్ డీఎస్పీలు ఏ సంపత్ రావు, జీ రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, భరోసా సెంటర్ ఇన్చార్జి సీఐ అజయ్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు ఏస్ ఐ లు, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img