ఇదే నిజం, చేవెళ్ల : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో భీమ్ భరత్ తోపాటు చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు వారు పలు అంశాలపై సీఎంతో ప్రస్తావించారు. అలాగే పలు సమస్యలను సీఎంకు వివరించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు సరైన న్యాయంతో పాటు తగిన గుర్తింపు కల్పించాలని విన్నవించారు. అదేవిధంగా పార్టీలో నిబద్ధతతో, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానంతో కూడిన నామినేటెడ్ పదవులు ఇచ్చి, వారి కష్టానికి గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరారు. తమ సమస్యలను సానుకూలంగా విని స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలు, సమస్యలపై తొందరలోనే మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించేందుకు, తమ సమస్యలు పరిష్కరించేందుకు సీఎం హామీ ఇవ్వడంపై భీమ్ భరత్, కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎంను భేటీ అయ్యేందుకు సహకరించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ, పార్లమెంట్ ఇంచార్జ్ రంజిత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, చేవెళ్ళ పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, దామార్లపల్లి మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, శంకర్ పల్లి మండల సీనియర్ నాయకులు బద్దం కృష్ణా రెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, చేవెళ్ళ మండల సీనియర్ నాయకులు మధుసుధాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు పెంటా రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సుశాంత్, నవాబ్ పేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, నాయకులు సుభాష్ మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.