- మాటలకే పరిమితమైన కాంగ్రెస్….
- గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి.
- కేంద్ర ప్రభుత్వం చేస్తున్నపథకాల వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి.
ఇదే నిజం, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శనివారం ఉపాధి హామీ కూలీలతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రవీణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయ్యాయని, 6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. రైతులకు బోనస్ ఎక్కడ పోయిందని వివాహానికి తులం బంగారం ఎక్కడుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు గ్రహించాలని మోసం చేస్తున్న పార్టీని గెలిపించకుండా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరిస్తూ నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, అరిగేల శ్రీకాంత్, శెట్టి రవి, సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.