Homeహైదరాబాద్latest NewsSitara చేతికి ‘భ్రమయుగం’

Sitara చేతికి ‘భ్రమయుగం’

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో న‌టించిన తాజా పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ చిత్రం ‘భ్రమయుగం’. ఈ సినిమాకు భూత‌కాలం ఫేమ్, రాహుల్‌ సదాశివన్ దర్శకత్వం వ‌హించారు.. వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర అండ్ ఎస్. శశికాంత్ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 15న మ‌ల‌యాళంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. చాలా రోజుల‌కు బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో సినిమా చూశామని చెబుతున్నారు. అయితే ఈ చిత్రం మ‌ల‌యాళంలో క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతున్న తెలుగు వెర్ష‌న్ మాత్రం ఇంకా విడుద‌ల కాలేదు. ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుద‌ల‌వుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలోనే వారికి గుడ్ న్యూస్ అందించింది తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్. ఈ సినిమా తెలుగు హక్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనితో పాటు విడుద‌ల తేదీని కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Recent

- Advertisment -spot_img