Bhu Bharathi: తెలంగాణ భూ భారతి సరికొత్త పోర్టల్ ను నేడు (ఏప్రిల్ 14) ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మరికొద్దిసేపట్లో ఈ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ భూ సమస్యల పరిష్కారం, లావాదేవీల సమాచారాన్ని రైతులు మరియు ప్రజలకు సులభంగా, వేగంగా అందించడం లక్ష్యంగా రూపొందించబడింది. ప్రారంభ దశలో మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు, ప్రజల సూచనల ఆధారంగా పోర్టల్‌ను మెరుగుపరుస్తారు.