ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా భుజంగరావు వాంగ్మూలంలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ‘ప్రతిపక్షాల కుటుంబాల ఫోన్లు ట్యాప్ చేశాం. టీఎస్‌పీఎస్సీ కేసులో కేసీఆర్‌ను విమర్శించిన ప్రతి ఒక్కరి ఫోన్‌నూ ట్యాప్ చేశాం. GHMCతో పాలు మూడు ఉపఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేశాం. పలువురితో కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేపించాం. జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకుల ఫోన్లు ట్యాప్ చేశాం. 2018, 2023 ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాప్ అయ్యాయి. సన్నిహితులను మాత్రమే ప్రత్యేక టీంలో ఏర్పాటు చేసుకున్నాం’ అని చెప్పారు.