Homeహైదరాబాద్latest Newsకుప్పం బరిలో భువనేశ్వరి..ఆంధ్ర రాజకీయాల్లో అలజడి

కుప్పం బరిలో భువనేశ్వరి..ఆంధ్ర రాజకీయాల్లో అలజడి

TDP అధినేత చంద్రబాబుకు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ్నుంచే పోటీ చేయనున్నారు. ఈ సమయంలో నారా భువనేశ్వరి కుప్పం వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు కుప్పంలో రెస్ట్ ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో ఈ సారి విశ్రాంతి ఇచ్చి..తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే కార్యకర్తలు, మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తనకు మనసులో ఈ కోరిక కలిగిందని.. చంద్రబాబు పోటీ చేయాలని ఎవరు అనుకుంటున్నారో చేతులెత్తండి అని ఆమె అడిగారు. దీంతో చాలామంది చేతులెత్తారు. తాను పోటీ చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారు అని అడగ్గా.. మళ్లీ అందరూ చేతులెత్తారు. అలా కుదరదు… ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని… రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు… అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img