Homeహైదరాబాద్latest Newsఐపీఎల్ లో చారిత్రాత్మక రికార్డు సృష్టించిన భువి.. అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు..!

ఐపీఎల్ లో చారిత్రాత్మక రికార్డు సృష్టించిన భువి.. అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు..!

భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2025లో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ వికెట్‌ను పడగొట్టాడు. దీనితో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ 18వ ఓవర్‌లో తిలక్ వర్మను అవుట్ చేశాడ. దీనితో ఈ మ్యాచ్ లో ఆర్‌సిబి 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ వికెట్‌తో భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో మొత్తం 184 వికెట్లు తీసి, డ్వేన్ బ్రావో యొక్క 183 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్రావో ఈ 183 వికెట్లను 161 మ్యాచ్‌లలో తీసుకోగా, భువనేశ్వర్ 179 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచాడు, అతని ముందు యుజ్వేంద్ర చాహల్ (206 వికెట్లు) మరియు పీయూష్ చావ్లా (192 వికెట్లు) మాత్రమే ఉన్నారు.

Recent

- Advertisment -spot_img