అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్‌కు విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై ఆయన పునరాలోచించుకోవాలని మాజీ అధ్యక్షుడు ఒబామా తన మిత్రుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. డెమోక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా బైడెన్‌కే ఫోన్ చేసి.. రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అమెరికా అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
కొత్త ప్రెసిడెంట్ అభ్యర్థిగా
బిడెన్ ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకుంటే డెమొక్రాట్ల తరపున ప్రెసిడెంట్ రేసులో ఎవరు ఉంటారన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఒకవైపు భారతీయ సంతతికి చెందిన కమలా హరీస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. జో బిడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే, అధ్యక్ష పదవికి కమలా హారిస్ అగ్రస్థానంలో ఉంటారని డెమోక్రాట్లు చెబుతున్నారు.