తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8.30 గంటల వరకు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు 40-50 Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.