ఇదే నిజం, గొల్లపల్లి: పలు లింకుల రూపంలో రుణమాఫీ సంబంధించిన సమాచారం గ్రూపులలో తదితర మాధ్యమాలలో ప్రచారం చేసే అవకాశం ఉన్నది. తెలంగాణలో రైతు రుణమాఫీ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ అన్నారు. ఎవరూ APK లింక్స్ ఓపెన్ చేయొద్దని తెలిపారు. అనుమానం వస్తే 1930కు కాల్, లేదా www.cybercrime.gov.in లోనూ ఫిర్యాదు చేయాలని ఎస్సై చిర్ర సతీష్ తెలిపారు.