Homeహైదరాబాద్latest Newsబిగ్ బ్రేకింగ్ … నిన్న మూడు కోట్ల కారు.. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ...

బిగ్ బ్రేకింగ్ … నిన్న మూడు కోట్ల కారు.. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

హైదరాబాద్ లో ఈడీ సోదాలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.. ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పటాన్‌చెరులోని మూడు ప్రాంతాలతోపాటు నిజాంపేటలోని మహిపాల్‌రెడ్డి అల్లుడు చంద్ర శేఖర్ రెడ్డి ఇంట్లోకూడా సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు .నిన్న మూడు కోట్లతో ఒక లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు

Recent

- Advertisment -spot_img