వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వచ్చారు. ఈ క్రమంలో వంశీ వాహనాన్ని గమనించిన పోలీసులు.. ఆయన ఇంటి సమీపంలోనే అదుపులోకి తీసుకున్నారు. వెంటనే గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు.