తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉండటంతో టీపీసీసీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ సుదీర్ఘ మంతనాలు చేసింది. చివరకు పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడ్డారు. చివరకు మహేశ్ కుమార్ గౌడ్ నే ఆ పదవి వరించింది.