ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోతో దొరికిపోయాడు. తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది. చెల్లి, చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది. జూలై 6న తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.