Homeహైదరాబాద్latest Newsరైతులకు భారీ శుభవార్త.. 50 శాతం సబ్సిడీతో పరికరాలు..!!

రైతులకు భారీ శుభవార్త.. 50 శాతం సబ్సిడీతో పరికరాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్-మిషన్ కింద రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంలో, ఏపీ ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ. 2.80 కోట్లు మంజూరు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్రష్ కట్టర్లు, పవర్ టిల్లర్లు, పంట రక్షణ, హ్యాండ్, పవర్ స్ప్రేయర్లు మరియు ట్రాక్టర్-డ్రివెన్ బూమ్ వంటి పరికరాలను అందిస్తారు. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి, రైతులు 5 ఎకరాల కంటే తక్కువ పొలం కలిగి ఉండాలి అని వెల్లడించారు. అలాగే SC, ST, మరియు మహిళా రైతులను అర్హులుగా పేర్కొన్నారు.
.

Recent

- Advertisment -spot_img