ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముస్తాబాద్ పెద్ద చెరువు నిండుకుండలా నిండి మత్తడి దూకుతుండడంతో పట్టణ ప్రజలు చెరువును వీక్షించడానికి తరలి వస్తున్నారు. దీంతో ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిసి మత్తడి దూకే దృశ్యాలను వీక్షించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాలం కాదన్నా వరుణ దేవుడు కరుణించి రాష్ట్రంలో ప్రాజెక్టులు చెరువులు కుంటలు నింపిందని అన్నారు. గత కాంగ్రెస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకే రోజు వర్షం కోట్టి కాలం అయిందని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి తొమ్మిది నెలలకే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రాష్ట్రంలోనే సమృద్ధిగా వర్షాలు కురడాన్ని హర్షిస్తున్నామని వర్షానికి నష్టపోయిన ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి,అగుల్ల రాజేశం, ప్రతాప్ రెడ్డి తోట ధర్మేందర్, జంగా భూమారాజం, కావేటి మహిపాల్, నవీన్ శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.