Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్‌కు భారీ ఊరట..ఆ కేసును కొట్టివేసిన ఏపీ కోర్టు

అల్లు అర్జున్‌కు భారీ ఊరట..ఆ కేసును కొట్టివేసిన ఏపీ కోర్టు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత మేలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో తన స్నేహితుడు శిల్పా రవి చంద్ర కిషోర్ తెట్టి ప్రచారం చేశారు. ఆ సమయంలో నంద్యాలలో శిల్పా రవి ఇంటి వద్ద భారీ ఎత్తున జనం గుమిగూడి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే అల్లు అర్జున్‌ ర్యాలీ నిర్వహించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్, శిల్పా రవి నంద్యాలలో ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, శిల్పా రవిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, శిల్పా రవిలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం నవంబర్ 6, 2024న తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్‌కి ఊరట లభించింది.

Recent

- Advertisment -spot_img