కువైట్‌కు చెందిన గల్ప్ బ్యాంక్ నుంచి కేరళ నర్సులు రూ.కోట్లలో రుణం తీసుకుని ఉడాయించారు. సుమారు 1400 మంది మలయాళీలు దాదాపు రూ.700 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారు. ఈ నేపథ్యంలో గల్ప్ బ్యాంక్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ కేరళలో ఏడీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేశారు. ఒక్కొక్క నర్సు సుమారు 50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.