Homeహైదరాబాద్latest NewsBig Scam : హైదరాబాద్‌లో బిగ్ స్కామ్.. బోర్డు తిప్పేసిన కంపెనీ.. రూ.14 కోట్లు కొట్టేశారు

Big Scam : హైదరాబాద్‌లో బిగ్ స్కామ్.. బోర్డు తిప్పేసిన కంపెనీ.. రూ.14 కోట్లు కొట్టేశారు

Big Scam : హైదరాబాద్‌లో మరో స్కామ్ (Big Scam) బయటపడింది. కూకట్పల్లిలో వెల్విజన్ ఇన్ఫ్రా అనే కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ ఆశ చూపించి రూ. 14 కోట్లు వసూల్ చేసారు. పెట్టిన పెట్టుబడికి ప్రతి నెల ఫ్రిడ్జ్, టీవీలు బోనస్గా ఇస్తామని మోసం చేసారు. రూ. లక్షకు టీవీ, 2 లక్షలకు వాషింగ్ మిషన్, 3 లక్షలకు ఫ్రిడ్జ్ బోనస్గా ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ. 14 కోట్లు కొట్టేశారు. వెల్విజన్ కంపెనీ గత మూడు సంవత్సరాలుగా పెట్టుబడుల పేరుతో డబ్బు వసూలు చేస్తోంది. ఈ కంపెనీ దాదాపు 200 మందిని మోసం చేసింది. మోసపోయామని గ్రహించిన తర్వాత దాదాపు 35 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఫలితంగా, EOW అధికారులు వెల్విజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్‌ను అరెస్టు చేసారు.

Recent

- Advertisment -spot_img