Homeహైదరాబాద్latest Newsబామ్మర్ది కోసం భారీ స్కాం.. అమృత్ టెండర్ల పేరిట రేవంత్ భారీ అవినీతి.. కేటీఆర్ సంచలన...

బామ్మర్ది కోసం భారీ స్కాం.. అమృత్ టెండర్ల పేరిట రేవంత్ భారీ అవినీతి.. కేటీఆర్ సంచలన ఆరోపణలు..!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమృత్ టెండర్ల పేరిట భారీ అవినీతికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బావమరిది సూదిని సృజన్ రెడ్డి కోసం ఈ స్కామ్ చేశారని విమర్శించారు. ఈ కుంభకోణంతో రేవంత్ ముఖ్యమంత్రి పదవి కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి 8,888 కోట్ల భారీ స్కామ్ చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ అనే పథకాన్ని తీసుకొచ్చారని.. ఈ స్కీమ్ లోనే ము ఖ్యమంత్రి రేవంత్, ఆయన బావమరిది సృజన్ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించా రు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమ రిది జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెర లేపారని తెలిపారు. 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందని, రేవంత్ రెడ్డి బావమరిది 80 శాతం వెయ్యి కోట్ల పని చేస్తుందని అంటున్నారని పేర్కొన్నారు.
ఐహెచ్పీ అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని అన్నారు. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని అనుముల రేవంత్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిప డ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టా రని అన్నారు. బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నా రని కేటీఆర్ విమర్శించారు. తన ఇంట్లో లంకె బిందెలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు ముఖ్యమంత్రి తెరలేపారని తెలిపారు. రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో పిలిచిన 8,888 కోట్ల రూపాయల టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని అన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం వలన ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్ బయటకు వచ్చిందని తెలిపారు. త్వరలో కొడంగల్ ఎత్తి పోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుం భకోణాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతామ ని స్పష్టం చేశారు. .ఇంతపెద్ద అవినీతి జరిగిదే బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

spot_img

Recent

- Advertisment -spot_img