”పుష్ప 2” సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ”పుష్ప 2” సినిమా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. యుగేందర్ గౌడ్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రచార మోజుతో ప్రజల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. జనాన్ని అదుపు చేయలేక పోలీసులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికాగా, మరో పసికందు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కాబట్టి పుష్ప 2 చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.