బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులోనే ఘోర ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం అయ్యాడు. నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు మేనేజ్‌మెంట్ దృష్టికి హేజిల్‌వుడ్ తీసుకొచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.