Homeహైదరాబాద్latest Newsకమెడియన్ అలీకి బిగ్ షాక్.. అక్రమ నిర్మాణాలపై నోటీసులు..!

కమెడియన్ అలీకి బిగ్ షాక్.. అక్రమ నిర్మాణాలపై నోటీసులు..!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామిడి పంచాయతీ పరిధిలో అలీ ఫాంహౌస్ ఉంది. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని విలేజ్ సెక్రటరీ శోభారాణి నోటీసులు జారీ చేశారు. దీనిపై తన తరఫు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు అలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img