తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. ఇకపై రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్లను సరఫరా చేయలేమని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఇకపై రాష్ట్రంలో వాటి సరఫరా ఆగిపోనుంది. గత ఐదేళ్లుగా బీర్ల ధరల పెంపునకు TGBCL అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.