మేనేజ్మెంట్ కోట సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా పీజీ మెడికల్ కాలేజీలను బ్లాక్చేసి అమ్ముకున్నట్టు ఈడీ పేర్కొన్నది. ఇప్పటి వరకు ఈ కేసులో రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. ఇందులో మల్లారెడ్డి కాలేజీ రూ.2.89 కోట్లు, MNR కాలేజీ రూ.2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు కాలేజీ రూ.3.33 కోట్ల ఆస్తులున్నాయి.