దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.390 పెరిగి రూ.73,040కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.350 పెరిగి రూ.66,950 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,300 పెరిగి రూ.93వేలుగా ఉంది. కాగా, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలలో స్వల్ప తేడాలు ఉంటాయి.