Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే కొత్త ఇళ్లు మంజూరు కానున్నాయి. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, 71,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసింది. కోడ్ ముగిశాక ఎంపిక చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇళ్లు మంజూరు చేస్తారని తెలిసింది. మరోవైపు పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాయనున్నట్లు తెలుస్తుంది.