BSNL : బీఎస్ఎన్ఎల్ భారత టెలికాం పరిశ్రమలో భారీ మార్పు తీసుకువస్తుంది. బీఎస్ఎన్ఎల్ (BSNL) భారతదేశం అంతటా తన బీఎస్ఎన్ఎల్ 5G సేవను విస్తరిస్తోంది. బీఎస్ఎన్ఎల్ రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీకి భారీ షాక్ ఇచ్చింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 65,000 4జి సైట్‌లను అమలు చేసింది. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఈ చొరవలో BSNLకి సహాయం చేస్తోంది. టాటా మద్దతుతో, BSNL తన 4G నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల ద్వారా, BSNL తన 4G నెట్‌వర్క్‌ను 5G నెట్‌వర్క్‌గా మారుస్తోంది. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ మాదిరిగానే BSNL దేశవ్యాప్తంగా 5G NSAని విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే BSNL 5G SA కోసం పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే, ఇది ఇంకా పూర్తిగా ప్రారంభించబడలేదు. ప్రస్తుతం కంపెనీ ప్రస్తుతం ఈ ప్రయత్నానికి టెండర్‌ను పరిశీలిస్తోంది. BSNL ఢిల్లీలో 5G SA పరీక్షలను కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో ఇకపై ఇంటర్నెట్ సేవలు చౌకగా మారే అవకాశం ఉంది.