మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతోంది. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్, మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. మంచు కుటుంబంపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారి కేసును విచారిస్తున్నామని తెలిపారు. వారిని చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.