నేడు భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో ఆతిథ్య శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. కీలక ఆటగాడు హసరంగ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో అతను మిగిలిన రెండు వన్డేలకు అందుబాటులో ఉండడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొలి మ్యాచ్‌ను టైగా ముగించడంలో హసరంగ కీలక పాత్ర పోషించాడు.