‘పుష్ప 2’ మూవీ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా థియేటర్లో 2డితో పాటు 3డిలో కూడా విడుదల కానుంది. కానీ ‘పుష్ప 2’ మూవీ 3డి వెర్షన్‌ను ప్రస్తుతం విడుదల చేయడం లేదు అని చిత్ర బృందం ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల ‘పుష్ప 2’ 3డి వెర్షన్ ఈ వారం విడుదల కావడం లేదు అని తెలిపారు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ‘బుక్ మై షో’ నుంచి తెలుగు, హిందీ 3డి వెర్షన్ బుకింగ్ ఆప్షన్ ఇప్పటికే తొలగించబడింది. 3డి వెర్షన్ వచ్చే వారాల్లో విడుదల కానుందని సమాచారం. అయితే ‘పుష్ప’ మూవీ 2డిలో మాత్రమే విడుదల కానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
.