వేణు స్వామికి బిగ్ షాక్ తగిలింది. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్లు 2027 వరకే కలిసి ఉంటారని తర్వాత విడిపోతారని అంటూ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశాడు. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు విడిపోతారు అంటూ చేసిన కామెంట్ల మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ అంశం మీద వేణు స్వామికి మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ నెల 22వ తేదీన వేణు స్వామి వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లుగా మహిళా కమిషన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దీనిపై వేణు స్వామి ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.