Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కు బిగ్ షాక్

బీఆర్ఎస్ కు బిగ్ షాక్

ఇదేనిజం, నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలంలో బిఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. నాగల్గిద్ద మండలం బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ మొత్తిభాయి రాథోడ్, సోషల్ మీడియా అధ్యక్షుడు బాలాజీ, సుమారు 100 కుటుంబలతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీని వీడీ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఎంపీపీ మొత్తిబాయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతున్నామన్నారు. నాగల్గిద్ద మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ అందిస్తానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ గెలుపు కోసం సైనికుల పని చేసి భారీ మెజారిటీ గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి బహుమతిగా ఇస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసి సభ్యులు శంకరాయ్యస్వామి, మండల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాణిక్ రావు పటేల్, సోపానరావు, ఒంకర్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img