Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కు భారీ షాక్.. పార్టీ మారనున్న 20 మంది మాజీ సర్పంచులు

బీఆర్ఎస్ కు భారీ షాక్.. పార్టీ మారనున్న 20 మంది మాజీ సర్పంచులు

ఇదేనిజం, కంగ్టి: పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ కంగ్టి మండల రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలా పాడిన బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న కొద్దో గొప్పో క్యాడర్ ను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని లోకల్ లీడర్స్ పార్టీ నియోజకవర్గ నాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారని వినికిడి. ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయా గ్రామ అధ్యక్షులు, సుమారు 18 నుండి 20 మంది మాజీ సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు, మాజీ మండల అధ్యక్షులు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు చేరికను గుట్టుచప్పుడు కాకుండా అపర్సషన్ ఆకర్ష్ ను కంగ్టి మండల నికి చెందిన ఒక వ్యక్తి కనుసన్నల్లో జరుగుతున్నట్టు సమాచారం. రేపు మండల కేంద్రంలో జరగబోయే బీజేపీ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, పార్లమెంట్ ఇంచార్జి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img