Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కు భారీ షాక్.. కరీంనగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్

బీఆర్ఎస్ కు భారీ షాక్.. కరీంనగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్

ఇదేనిజం, కరీంనగర్: ‘ఇదేనిజం’ చెప్పినట్టుగా కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ అసం తృప్త కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నట్టు గత 26న మన ‘ఇదేనిజం’ ముందే చెప్పింది. ఆ మేరకు శుక్రవారం సిరిసిల్లలో శుక్రవారం రాత్రి పొద్దుపో యాక ఆలస్యంగా జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్పొరేటర్లలో ఆకుల నర్మద (11వ డివిజన్), గంటా కల్యాణి శ్రీనివాస్(22వ డివిజన్), చాడగొండ బుచ్చిరెడ్డి (35వ డివిజన్), కోటగిరి భూమా గౌడ్ (40వ డివిజన్), సరిల్ల ప్రసాద్(43వ డివిజన్), మెండి శ్రీలతా చంద్ర శేఖర్(44వ డివిజన్), పిట్ల వినోదా శ్రీనివాస్ (45వ డివిజన్), నేతికుంట యాదయ్య(30వ డివిజన్), కేశెట్టి శ్రీనివాస్ (2వ డివిజన్), కొల్ల భాగ్యలక్ష్మి ప్రశాంత్(17వ డివిజన్), ఆకుల ప్రకాష్ (మాజీ కా ర్పొరేటర్), పట్టెం పద్మామోహన్ (అర్బన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్), డైరెక్టర్లు కర్రా రాజశేఖర్, వీరారెడ్డి, బొమ్మరాతి సాయికృష్ణ, అనిరాస్ కుమార్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మె ల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, కేకే మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా, ఆ సంఖ్య ఇప్పుడు 11కు చేరింది.

మరో నలుగురు బీజేపీలోకి..
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కరీంనగర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్లు బిగ్ షాక్ ఇస్తున్నారు. మరో నలుగురు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గత కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్మే వ్యవహా రంలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై విసిగిన కార్పొరేటర్లు గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్నఎమ్మెల్యే పనులు కేటాయించడంలో వివక్ష చూపించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. తన సామాజిక వర్గ కా ర్పొరేటర్లనే అందలం ఎక్కించి, కరీంనగర్ లో అరాచకాలకు పాల్పడ్డారని, కేసు అయ్యి జైలుకు వెళ్లిన తన వారికి ఆయన దగ్గర ప్రత్యేక స్థానం ఉందని ఆరోపిస్తున్నారు. అలాంటి నాయకుడి వద్ద ఉండటం కన్నా, పార్టీ మారడమే ఉత్తమ మని కార్పొరేటర్లు వాపోతున్నారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Recent

- Advertisment -spot_img