Homeహైదరాబాద్latest Newsపెద్దపులి కలకలం.. రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పులి..!

పెద్దపులి కలకలం.. రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పులి..!

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పులి కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మాకడి వద్ద పులి కలకలం సృష్టించింది. రైలు పట్టాలు దాటుతుండగా పెద్దపులి కెమెరాకు చిక్కింది. పట్టాలు దాటుతుండగా పులి అక్కడక్కడ చూసింది. ట్రాక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి పులి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే పులి అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి. రైల్వే స్టేషన్ సమీపంలో పులి సంచారంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Recent

- Advertisment -spot_img