షాద్‌నగర్‌లో కలకలం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. ఆయన కొడుకు శివ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు తెలిపారు. బాబా శివానంద్ అనే వ్యక్తికి రూ. 25 లక్షలు, ఇల్లు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ. 2 లక్షలు ఇచ్చాడు. కృష్ణ తన మూడో భార్య పావనికి రూ.16 కోట్ల ఆస్తి ఇవ్వడంతో శివ కోపం పెంచుకున్నాడు.