రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగుభూములకే సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్, ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయమై భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సీఎం రేవంత్తో చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.