తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలు చేయనున్నారు. ఇప్పటికే స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావటంతో మార్కుల క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తుాన్నారు. ఏప్రిల్ 22వ(సోమవారం) తేదీన రిజల్ట్స్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ తేదీ కుదరకపోతే 25వ తేదీలోపు దాదాపుగా ప్రకటించవచ్చు. ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన చేయనుంది.