Homeహైదరాబాద్latest NewsBigg Boss 8: బిగ్‍బాస్ సీజన్ 8 కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాగార్జున.....

Bigg Boss 8: బిగ్‍బాస్ సీజన్ 8 కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాగార్జున.. ఏకంగా అన్ని కోట్లా..?

బిగ్‍బాస్..ఈ షో గురించి తెలియని వారు ఉండరు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకులకు బిగ్‍బాస్ షో సుపరిచితం. తెలుగులో విజయవంతంగా 7 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్‍బాస్ ఇప్పుడు 8వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇటీవలే బిగ్ బాస్ 8 ప్రోమో కూడా రిలీజ్ చేసింది స్టార్ మా. దాదాపు కంటెస్టెంట్ లిస్టు కూడా ఫైనల్ అయిపోయింది. సీజన్ 8 వచ్చేనెలోనే ప్రసారం కానుందని స్టార్ మా ఛానెల్ అధికారికంగా ప్రకటించింది.

గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ తెలుగు షోను టాలీవుడ్ నటసామ్రాట్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కొత్త సీజన్‌లో నాగార్జున రెమ్యునరేషన్ మరోసారి ఆసక్తికరంగా మారింది. నాగార్జున ఈ సారి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఈ సారి రూ. 20 కోట్లు కాకుండా రూ. 30 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులు , సినీ పరిశ్రమలో నాగార్జున రెమ్యునరేషన్ అనేది చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img