బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫుల్ జోష్ లో కొనసాగుతుంది.. 14మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యిన విషయం మనకు తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరికి నాగమణికంఠ నచ్చడం లేదు.. ఏదొక విధంగా మణికంఠను అవాయిడ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. నిన్న ఎపిసోడ్ లో రెండు క్లాన్స్ ఉంటే ఒక్క చీఫ్ కూడా నాగమణికంఠను టీమ్ లోకి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.. అది మణికంఠకు అర్థం అయినప్పటికీ బయటపెట్టలేదు. మరోవైపు యష్మికి నాగమణికంఠ అంటే అసహ్యం అని అతను ఆమెతో మాట్లాడుతున్నప్పుడే చూస్తే చాలు మనకు అర్థం అవుతుంది.
ఇక అలానే అతను వీక్ అని అసలు అబ్బాయిలలోకి యాడ్ చెయ్యలేమంటూ ఓ మాట అనేసింది యష్మీ గౌడ. నేడు తాజా ప్రోమోలో కూడా ఇదే చేసింది. పృథ్వీ, నబీల్‌లకు ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. సంచాలక్‌గా ఉన్న మణికంఠ.. వాళ్లని ఉత్తేజపరచడం కోసం పాట పడుతుంటే.. ‘అబ్బో.. అని తలపట్టుకుని.. నీ పాటతో డీమోటివేట్ అయిపోతారు’ అని తెగ ఫీల్ అయిపోయింది యష్మీ గౌడ. ఇది మాత్రమే కాదు.. బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో నిఖిల్ టీమ్ ఓడిపోవడంతో బిగ్ బాస్ ఒకరిని టీమ్ లో నుంచి తొలిగించమని చెప్పడంతో టీమ్ అందరూ కనీసం ఆలోచించకుండా నాగ మణికంఠను తొలిగిస్తారు. దీన్ని బట్టి చూస్తే అందరు అతన్నే టార్గెట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఇది నాగమణికంఠ కు ప్లస్ అవుతుందా? లేదా అతను త్వరలో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి వెళ్ళిపోతాడా చూడాలి.