తెలుగు బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 8వ సీజన్లో 7వ సీజన్కు మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలో బిగ్‌బాస్ బజ్‌కు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదల చేశారు. దీనికి హోస్ట్గా అర్జున్ అంబటి వ్యవహరిస్తున్నారు. కాగా, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటకు వచ్చిన తరువాత బజ్లో పాల్గొంటారు.