బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ హౌసులో ప్రస్తుతం అవినాష్, గౌతమ్ , నిఖిల్ , నబీల్ అఫ్రిది, ప్రేరణ కంబం, విష్ణుప్రియ మరియు రోహిణి ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో అవినాష్ తప్ప అందరూ నామినేట్ అవ్వడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న టెన్షన్ నెలకొంది. ఈ వారంలో బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఓటింగ ప్రకారం నబీల్, ప్రేరణ డేంజర్ జోన్‌లో ఉన్నారు .మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాప్ 5లో చేరే మిగతా నలుగురు ఎవరనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.