తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్ 8’ హౌసులో ఏడో వారం ఎలిమినేషన్ లో బిగ్‌బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం నామినేషన్లు మొత్తం తొమ్మిది ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో పృథ్వీరాజ్, మణికంఠ, హరితేజ, నిఖిల్, యష్మీ గౌడ, నబీల్, ప్రేరణ, గౌతం కృష్ణ మరియు టేస్టీ తేజ ఉన్నారు. ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. ఇతనికి తక్కువ ఓట్లు పోలయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం మణికంఠ ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు ఓకే గేమ్ ఇచ్చారు. ఇందులోవారు వారి గురించి మరియు వారి ఆట పనితీరు గురించి చెప్పమని తెలిపారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో మణికంఠను అందరూ టార్గెట్ చేశారు. ఇందులో యష్మీ ” ఆటలో వీక్, డ్రామాలో పీక్, కన్నీళ్లు ” అని ట్యాగ్ ఇచ్చింది. దీనికి పలువురు హౌస్‌మేట్స్ మద్దతు తెలిపారు.
దీనిపై మణికంఠ వివరణ ఇస్తూ.. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం, మెదడుకు ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. బ్రెయిన్ పనిచేయడం లేదని, కూర్చోలేక నిలబడలేనని, పిచ్చి పిచ్చిగా ఉంటుందన్నారు. తనకు ఈ గేమ్ చాలా ఇష్టమని, అయితే ఆడలేకపోతున్నానని తనను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపాలని నాగార్జున వేడుకున్నాడు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ఓటింగ్ ప్రకారం మణికంఠ ఎలిమినేట్ చేసారని సమాచారం. అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది అఫిషీయల్‌గా ఆదివారమే తెలుస్తోంది.