Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. చీఫ్​ గెస్ట్​గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. చీఫ్​ గెస్ట్​గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ టైటిల్ ఎవరు అందుకుంటారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ప్రతి సంవత్సరం ఒక ముఖ్య అతిథి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బిగ్‌బాస్ ఫైనల్ జరగనుంది. నేడు జరిగే ఫినాలే ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్​ గెస్ట్​గా వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. జనాలు గుమిగూడి ఉండటం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img